ఛీ..ఛీ.. వీళ్లు మనుషులైనా.. కామంతో ఓవైపు తండ్రి.. మరోవైపు అన్న

-

రోజు రోజుకు అమ్మాయిలపై లైంగిక వేధింపులు తారాస్థాయికి చేరుతున్నాయి. బయటే అనుకుంటే ఇంట్లోకూడా అమ్మాయిలకు రక్షణలేకుండా పోయింది. కన్న తండ్రి, తోడబుట్టిన వాడే మృగాళ్లలా మారి లైంగింక వేధింపులకు దిగారు. ఓ ఆడపిల్లకు ఏదైనా కష్టం వస్తే ఆమె మొదట తన తండ్రి లేదా సోదరుడికి ఫిర్యాదు చేస్తుంది. అలాంటిది వారి వల్లే ఆమె మానసిక క్షోభ అనుభవిస్తుంటే ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కాక ఆ బాలిక తనలో తానే కుమిలిపోయింది. తరగతి గదిలో పాఠాలు కూడా సరిగ్గా వినేది కాదు.. దీంతో ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి ఆ బాలికను అడిగారు. ఆ బాలిక చెప్పింది విని షాకైపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఆ బాలిక ఇంటికి చేరుకుని ఆమె తండ్రిని, సోదరుడిని అరెస్ట్ చేశారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

Minor girl sexually harassed and filmed, accused absconding | Catch News

ఇంటర్మీడియెట్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను కన్న తండ్రి, తోడబుట్టిన సోదరుడు వేధిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా దొరికితే చాలు.. తండ్రి, సోదరుడు ఆమెతో నీచమైన పనులు చేస్తుంటారు. తమ రక్త సంబంధం అని కూడా చూడకుండా ఆమెతో కామ వాంఛ తీర్చుకుంటారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని ఇద్దరూ బెదిరించారు. వారేం చేస్తోరో అనే భయం, కుటుంబ పరువు పోతుందనే బాధతో ఆ బాలిక నోరు విప్పలేదు. అయితే ఆ బాలిక ఎందుకో బాధపడుతోందని కళాశాల ఉపాధ్యాయులకు అర్థమైంది. ఆమెను అడిగితే అసలు విషయం చెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Latest news