‘ఆమె’ అతడిగా మారింది.. రికార్డుల్లో జెండర్ మార్చుకున్న IRS

-

ఆల్ ఇండియా సర్వీసుల చరిత్రలో మొదటిసారి ఒక మహిళా అధికారి పురుషునిగా లింగమార్పిడి చేయించుకొని తన పేరు మార్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కస్టమ్స్‌ ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో సంయుక్త కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం.అనుసూయ.. ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన జెండర్, పేరును మార్పించుకున్నారు. పుట్టుకతో మహిళగా పరిగణించిన తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను అభ్యర్థించారు. ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన ఆర్థిక మంత్రిత్వశాఖ అన్ని అధికారిక రికార్డుల్లో మార్పులు చేసి ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఇకపై అనుసూయను అనుకథిర్‌ సూర్యగా, పురుషునిగా పరిగణించాలని అందులో పేర్కొంది.

చెన్నైకి చెందిన అనుసూయ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చేసి సివిల్‌ సర్వీసు పరీక్షల ద్వారా 2013లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. చెన్నై ఆదాయపన్ను విభాగంలో సహాయ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె 2023 నుంచి హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం అఖిల భారతస్థాయి అధికారి లింగమార్పిడి చేయించుకొని పేరు మార్చుకోవడం చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news