ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు పహల్గామ్‌కు జ్యోతి మల్హోత్రా వెళ్ళింది. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లదించింది.

పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్ జ్యోతికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయ్. ఉగ్రదాడి ఘటనకు మూడు నెలల ముందు జ్యోతి పహల్గామ్ వెళ్లి అక్కడ వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు పూరి జగన్నాధ్ టెంపుల్ కు కూడా జ్యోతి మల్హోత్రా వెళ్ళింది. అక్కడ కూడా కాల్పులకు ప్లాం చేసినట్లు సమాచారం అందుతోంది.