కాంగ్రెస్ కు ఓటేయడమంటే మోసాన్ని బలపరిచినట్లేనని ఫైర్ అయ్యారు హరీష్ రావు. నల్లగొండ జిల్లా దేవరకొండలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదు..ఉద్యోగులకు మూడు డీఏలు అన్నారు… ఒక్క డీఏ కూడా రిలీజ్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… ఉద్యోగులను మోసం చేసిందని ఆగ్రహించారు.
విద్యావంతులు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలి.. కాంగ్రెస్ కు ఓటేయడమంటే కాంగ్రెస్ మోసాన్ని బలపరిచిన ట్లవుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముప్పై రోజులైనా వడ్లు కొనలేదు..తడిసిన ధాన్యం కొనుగోలు చేసే నాథుడు లేడని నిప్పులు చెరిగారు. బోనస్ విషయంలో చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం..ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.