జో బైడెన్ మా అధ్య‌క్షుడు కాదు.. ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌..

-

అమెరికా 46వ అధ్య‌క్షుడిగా జో బైడెన్ ఇటీవ‌లే ప్ర‌మాణ స్వీకారం చేసి బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందుగానే మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ అధ్య‌క్ష భ‌వ‌నాన్ని ఖాళీ చేసి వెళ్లిపోగా, ఆ భ‌వ‌నంలోకి ప్ర‌స్తుతం బైడెన్ వ‌చ్చారు. అయితే జో బైడెన్ అమెరికా అధ్య‌క్షుడు అయిన త‌రువాత కూడా ఆయ‌న మా అధ్య‌క్షుడు కాదు.. అంటూ ట్రెండింగ్ అవుతోంది. అది కూడా అమెరికాలో కాదు.. ఇండియాలో.. ఆ విధంగా ట్రెండ్ అవుతోంది.

జో బైడెన్ అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేశాక ఓ ఇండియ‌న్ ట్విట్ట‌ర్ యూజ‌ర్ రిప్లై ఇచ్చాడు. బైడెన్ ఈజ్ నాట్ మై ప్రెసిడెంట్ అని స‌మాధానం ఇచ్చాడు. అయితే ఒక యూజ‌ర్ అత‌న్ని మీరు ట్రంప్ కు మ‌ద్ద‌తుదారులా అని అడ‌గ్గా.. అందుకు అత‌ను.. కాదు, నాది ఇండియా.. అని స‌మాధానం ఇచ్చాడు. ఇక ఆ త‌రువాత నుంచి #JoeBidenIsNotMyPresident అనే హ్యాష్ ట్యాగ్ వైర‌ల్ అవుతోంది. అయితే కేవ‌లం ఆ ఒక్క రిప్లైతో ఈ విధంగా ట్రెండ్ అవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

కాగా జో బైడెన్ ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా గ‌ట్టి బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. ట్రంప్ మ‌ద్ద‌తుదారులు కుట్ర‌లు చేసి ఆయ‌న ప్ర‌మాణ స్వీకారాన్ని అడ్డుకోవ‌చ్చ‌ని, సాక్షాత్తూ సెక్యూరిటీ సిబ్బందే దాడి చేసే అవ‌కాశం ఉంద‌ని అమెరిక‌న్ నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. దీంతో బైడెన్ ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా పెద్ద ఎత్తున భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఇక భార‌త‌సంత‌తికి చెందిన క‌మ‌లా హ్యారిస్ అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ప్ర‌మాణం చేయ‌డంతో త‌మిళ‌నాడులోని ఆమె స్వ‌స్థ‌లంలో సంబ‌రాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version