ప్రతీ నెల డబ్బులు పొందాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఈ స్కీమ్ వలన చాల బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే.. మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో చేరితే ప్రతి నెలా రూ.5 వేలు పొందొచ్చు.
60 ఏళ్లు దాటిన తర్వాతనే అటల్ పెన్షన్ యోజన నుండి ప్రతి నెలా డబ్బులు వస్తాయి. అసంఘటిత రంగంలో పని చేసే వాళ్లకి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్నికేంద్రం తీసుకు వచ్చింది.
18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సహా ఇతర బ్యాంకులు కూడా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అందిస్తున్నాయి.
మీరు ప్రతి నెలా రూ.5 వేలు పొందాలని అనుకుంటే చేరచ్చు. మీరు చెల్లించే నెలవారి కంట్రిబ్యూషన్ ని బట్టి మీ పెన్షన్ డబ్బులు వస్తాయి. రూ.1000, రూ.2,000, రూ.3 వేలు, రూ.4,000, రూ.5 వేలు పెన్షన్ కూడా తీసుకోవచ్చు.
రూ.5 వేలు పెన్షన్ పొందాలని అనుకుంటే 18 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.210 చెల్లించాలి. నెలకు రూ.42 కడితే మీరు నెలకు రూ.1000 పొందొచ్చు.