బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న జేపీ నడ్డా

-

ఏపీ పర్యటనలో భాగంగా సోమవారం విజయవాడ చేరుకున్న జేపీ నడ్డా అక్కడ నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో మాట్లాడారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను బిజెపి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. కాగా నేడు (మంగళవారం) బెజవాడ దుర్గమ్మ ని దర్శించుకున్నారు.నడ్డాకు దుర్గగుడి ఈఓ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నడ్దాతో పాటు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, శివ ప్రకాష్, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఎప్పటినుంచో దుర్గమ్మ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను అని తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి మహిమ గురించి స్థానిక నాయకులు చెప్పారని అన్నారు. అమ్మవారి కృప, కరుణ, కటాక్షం ఉండాలని.. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదం తో మంచి పరిపాలన అందాలని జేపీ నడ్డా కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version