ఆయుష్షును పెంచే ఆహార పదార్థాలు ఇవే..!!

-

ఆరోగ్యానికి..ఆహారానికి.. ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మంచి ఆహారం తింటే మంచి ఆరోగ్యం వస్తుంది. ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా తిని జీర్ణించుకోగలడు. కానీ మారిన కాలంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి. పూర్వం మన పెద్దలు దినుసులు, పప్పులు, ఆకుకూరలు మెండుగా తినేవారు. అందుకే వారు పుష్టిగా ఆరోగ్యంగా ఉండేవారు. ఏ పని అయినా చక్కగా చేసుకునేవారు. ఇప్పుడున్న కాలంలో మనం తినే ఫాస్ట్ ఫుడ్ మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతోంది. ఏ పని చేసినా తొందరగా నీరసం రావడం, అలసిపోవడం, బోన్ డెన్సిటీ లేకపోవడం జరుగుతోంది.

ఇప్పుడు పులగం, కిచిడీ దద్దోజనం,పరమాన్నం, రొట్టెలు మొదలగునవి పూర్వం వంటలుగా మారిపోయాయి. వాటి స్థానంలో బర్గర్లు,పిజ్జాలు,ఫాస్ట్ ఫుడ్ లు అన్నీ చేరిపోయాయి. ఇవన్నీ సరిపడా శక్తిని ఇవ్వలేకపోయాయి. కాబట్టి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను కూడా మన శరీరం తట్టుకోలేకపోతోంది. మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులే దీనికి కారణం అని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.కాబట్టి ఆ మంచి ఆహారపు అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మన పెద్దలు ఏదైనా వండినప్పుడు అందులో రెండు మూడు రకాల దినుసులు, ఆకుకూరలు, పప్పులు వేసి వండడం, మిశ్రమ పదార్థాలు తినడం వారికి అలవాటు. ఈ అలవాటు వల్ల వల్ల కావలసిన పోషకాలన్నీ ఒకే పదార్థం లో దొరికే లాగా చూసుకునేవారు.ఇప్పుడు మనం వరి అన్నం మాత్రమే తినడం అలవాటు చేసుకున్నాము. ఇందులో లైసిన్ అనే ఎమైనో ఆమ్లము తక్కువగా ఉండటం వల్ల షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. ఈ అమైనో ఆమ్లాలు పప్పుదినుసులలో ఎక్కువగా ఉంటాయి.అందువల్ల రకరకాల పప్పు దినుసులను అన్నంతో కలిపి వండుకుంటే తగిన పోషకాలు మన శరీరానికి అందుతాయి.

మిగిలినది గింజధాన్యాలు రాగి, జొన్నలు ఉలవలు,సద్దలు,కొర్రలు, సామలు, అరికలు ఇవన్నీ పీచుపదార్థం గల ఆహారాలు. ఇవి ఆకుకూరలు,కూరగాయలతో కలుపి వండుకొని తింటే ఎక్కువగా ఆకలి వేయదు. కాబట్టి కడుపులో చక్కెరలు తొందరగా విడుదల కాకుండా చేస్తాయి. దీనివల్ల ఆహారం తినాలనే కోరిక ఎక్కువగా ఉండదు. దీనిలో ఉండే మాంసకృత్తులు వల్ల శరీరానికి తగిన పోషణ అందుతుంది. ఇలాంటి ఆహారాలను కలిపి వండుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version