గత నెల భారీ వర్షాలు భారత్‌ను తీవ్రంగా వణికించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి. ఉత్తర భారత్‌ను వరణుడు అతలాకుతలం చేశాడు. ఈ వర్షాలకు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టించాయి.
గత నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. షిమ్లాతో పాటు అనేక ప్రాంతాల్లో భీకర స్థాయిలో నష్టం వాటిల్లింది. నాలుగు రోజులుగా కురిసిన వానల వల్ల రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సమ్మర్ హిల్ వద్ద ఉన్న షిమ్లా-కల్కా రైల్వే లైన్ కొట్టుకుపోయింది. క్లౌడ్‌బస్ట్ వల్ల భారీ వరద రావడంతో.. రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి ఊడ్చుకుపోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ వేలాడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇతర ప్రదేశాల్లోనూ రైల్వే ట్రాక్ అక్కడక్కడ ధ్వంసమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు వర్షాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 81కి చేరుకుంది.
Rail track washed away in Shimla, Himachal Pradesh after cloudburst leaves 9 dead and 15 missing.
Om Shanti #HimachalPradeshRains #HimachalPradesh #Himachal pic.twitter.com/VvbMD9Ja1i
— 𝗦𝘁𝗿𝗼𝗸𝗲𝗢𝗚𝗲𝗻𝗶𝘂𝘀🇮🇳 (@Digvijay_Siingh) August 14, 2023