ఉదయనిధి చిన్నపిల్లవాడు.. సనాతన వ్యాఖ్యలపై స్పందించిన కమల్ హాసన్

-

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాయి. పెను దుమారాన్నే రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు మక్కల్ నీది మాయం పార్టీ చీఫ్ కమల్ హాసన్ స్పందించారు.

సనాతన అనే పదం పెరియర్ నుంచి వచ్చిందని ఉదయనిది కంటే ముందు కూడా పలువురు సనాతన ధర్మం గురించి మాట్లాడారని కమల్ హాసన్ పేర్కొన్నారు. సనాతన ధర్మంపై మాట్లాడినందుకు చిన్న పిల్లవాడు ఉదయనిదిని వెంటాడుతున్నారని అన్నారు పెరియర్ వల్లే సనాతన అనే పదం అందరికీ తెలిసిపోయిందని కెరియర్ తమ వాడని ఏ పార్టీ కూడా చెప్పుకోదని ఆయన తమిళనాడుకు సొంతమని కమల్ హాసన్ చెప్పారు. ఒకప్పుడు పెరియర్ గుడిలో పనిచేసేవాడని వారణాసిలో నుదుట తిలకం పెట్టుకొని పూజలు చేస్తుండే వాడని వాటన్నిటిని విడిచిపెట్టి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారంటే ఆయనకు ఎంతో కోపం వచ్చి ఉంటుందో ఊహించండి అన్ని ఆయన అన్నారు. ఆయన జీవితమంతా ప్రజల సేవతోనే గడిచిందని తెలిపారు. కమల్ హాసన్ ఇంతకుముందు కూడా ఈ వివాదం పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news