బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాల్లోనే చిక్కుకుంటుంది. గతంలో ఆమె రైతులను టెర్రరిస్టులుగా అభివర్ణించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఆమె వ్యాఖ్యలు చేస్తుంది. అలాగే ప్రవర్తిస్తుంది. అయితే ఆమె తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఇండస్ నది ప్రవహిస్తున్నందున భారత్‌కు బ్రిటిషర్లు ఇండియా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. విదేశీయులు ఇండియా అనే పిలుస్తారు. కానీ మన దేశంలో భారత్ అంటారు. అయితే బ్రిటిషర్లు మనల్ని బానిసల్లా చూశారని, వారు పెట్టిన బానిస పేరు ఇండియాను తీసేసి భారత్‌గా మన దేశ పేరును మార్చాలని ఆమె కోరింది. అప్పుడే స్వేచ్ఛ లభించినట్లు అని ఆమె పేర్కొంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమె ఈ విధంగా పోస్టు చేసింది.
అయితే కంగనా పోస్టులపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడు పేరు మార్చే గోల ఎందుకని అంటున్నారు. బ్రిటిషర్లు మన దేశాన్ని పాలించకముందు ఏయే పేర్లు ఉండేవో ఇప్పుడు ఆమెకు తెలుసా ? అని ప్రశ్నిస్తున్నారు. కాగా కంగనా రనౌత్ ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవిలో నటిస్తోంది. ఈ మూవీకి ఇటీవలే సెన్సార్ బోర్డు యు సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఈ క్రమంలో త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.