గంగానది ఒడ్డున నవజ్యోత్ సింగ్ సిద్ధూ కుమారుడి ఎంగేజ్​మెంట్

-

పంజాబ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కుమారుడు కరణ్ సిద్ధూ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. కరణ్ సిద్ధూ.. పాటియాలాకు చెందిన ఇనాయత్‌ రంధావాను వివాహం చేసుకోనున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం గంగానది ఒడ్డున కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సిద్ధూ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు.

‘‘నా కుమారుడు తన తల్లి కోరికను నెరవేర్చాడు. పవిత్ర దుర్గా-అష్టమి వ్రత తిథి (జూన్‌ 26న) నాడు గంగామాత ఒడిలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. మా కాబోయే కోడలు ఇనాయత్‌ రంధావా. వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు’ అంటూ సిద్ధూ ట్విటర్ పోస్టులో రాసుకొచ్చారు. తన కుమారుడి ఎంగేేజ్​మెంట్ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు.

ఈ ఫొటోల్లో సిద్ధూ, ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూ, కుమార్తె రబియా సిద్ధూ కూడా ఉన్నారు. పాటియాలాకు చెందిన మనీందర్‌ రంధావా కుమార్తెనే ఇనాయత్‌. గతంలో ఈయన ఆర్మీలో పనిచేశారు. ప్రస్తుతం పంజాబ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version