పాకిస్థాన్ పై కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాకు ఒక బాంబు ఇవ్వండి.. పాకిస్తాన్‌పై సూసైడ్ బాంబు దాడి చేస్తా అంటూ కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌తో సంబంధమే లేదు. యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా అంటూ ప్రకటించారు. మోదీ, షా నాకో సూసైడ్ బాంబ్ ఇస్తే నా ఒంటికి కట్టుకుని పోయి పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నా అన్నారు కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్.

దీంతో కర్ణాటక మంత్రి జమీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దారుణానికి వడిగట్టారు. పర్యటక ప్రాంతమైన పహాల్గాం కు వెళ్లిన 28 మంది పర్యాటకులను… అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారు. ఈ నేపథ్యంలోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.