రాజకీయ పార్టీపై కూడా పరువునష్టం కేసు వేయొచ్చు : కర్ణాటక హైకోర్టు

-

రాజకీయ పార్టీపై కూడా పరువు నష్టం దావా వేయొచ్చని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్​, బీజేపీపై వేసిన పరువు నష్టం కేసును కొట్టివేయడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు తగిన రక్షణ అవసరమని, అందువల్ల పరువునష్టనం అంత తీవ్రమైన నేరం కానప్పటికీ, దాన్ని తేలికగా తీసుకోలేమని తెలిపింది. ఈ కేసులో తమ అభిప్రాయాలు, ప్రత్యేక కోర్టులో పెండింగ్​లో ఉన్న పురువునష్టం కేసుపై ఎలాంటి ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది.

ఈ కేసులో  జస్టిస్​ ఎస్​ దీక్షిత్​ ధర్మాసనం విచారణ చేపట్టగా.. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 499, 500 ప్రకారం రాజకీయ పార్టీని వ్యక్తిగా పరిగణించలేమని బీజేపీ తరఫు న్యాయవాది వాదించారు. బీజేపీ వాదనపై రిజ్వాన్​ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఐపీసీ సెక్షన్ 11లో వ్యక్తిని నిర్వచించారని, పార్టీ కూడా చాలా మంది వ్యక్తులతో కూడిన సంస్థ అని పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం బీజేపీ పిటిషన్​ను కొట్టివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news