BANGALORE NEWS : పలు ఐటీ సంస్థలకు రెవెన్యూ మంత్రి వార్నింగ్

-

బెంగళూరును అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. నగర ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇటీవల కురిసిన వర్షాలకు బెంగళూరు నగరం పూర్తిగా మునిగిపోయిన వేళ బృహత్​ బెంగళూరు మహానగర పాలికె చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ముందుగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది.

నొయిడాలోని ట్విన్​ టవర్స్​ మాదిరిగానే బెంగళూరులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్​. అశోక్​. నగరంలో వరద నీరు వెళ్లకుండా నిర్మించిన అక్రమాల కూల్చివేత ప్రక్రియను చేపట్టింది. మహదేవెపుర జోన్​ పరిధిలోని శాంతినికేతన లేఔట్​ సహా పలు ప్రాంతాల్లోని ఈ అక్రమాల తొలగింపును చేపట్టింది బృహత్​ బెంగళూరు మహానగర పాలికె.

“సరైన పత్రాలు లేకపోతే ఎంతటి వారినైనా వదిలిపెట్టొదని డిప్యూటీ కమిషనర్​కు ఆదేశాలు జారీ చేశాను. చిన్నా పెద్దా తేడా లేకుండా తొలగించాలని చెప్పా. చాలా ఐటీ సంస్థలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. సుమారు 30 సంస్థల జాబితాను తయారు చేసి తొలగించాలని ఆదేశాలిచ్చాం.”

ఆర్​. అశోక్​, కర్ణాటక రెవెన్యూ శాఖమంత్రి

Read more RELATED
Recommended to you

Exit mobile version