నేను భారతీయుడిని.. ఎక్కడికైనా వెళ్లి పనిచేయగలను : సీఎం కేసీఆర్

-

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సర్కోలిలో పర్యటించారు. భగీరథ్‌ బాల్కే ఆహ్వానం మేరకు సర్కోలికి వెళ్లిన కేసీఆర్‌ .. బాల్కే తండ్రి భరత్ బాల్కే సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బీఆర్​ఎస్ సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ సమక్షంలో భగీరథ్‌ బాల్కే, పలువురు నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. గులాబీ కండువా కప్పి ఆ నేతలను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ప్రసంగిస్తూ.. ‘మహారాష్ట్రలో కేసీఆర్‌కు ఏం పని అని ఫడణవీస్‌ విమర్శిస్తున్నారు. నేను భారతదేశ వాసిని ఎక్కడికైనా వెళ్లి పనిచేయగలను. మహారాష్ట్రలో తెలంగాణ అజెండా అమలు చేస్తే నేను వెనక్కి వెళ్తా. ధరణి పోర్టల్‌ ద్వారా భూములను డిజిటలైజ్‌ చేస్తున్నాం. రైతులకు ఇచ్చే డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోనే పడుతున్నాయి. మహారాష్ట్ర నేత భగీరథ్‌ బాల్కేకు మంచి భవిష్యత్తు ఉంది. భగీరథ్‌ బాల్కేకు బీఆర్ఎస్ పూర్తి అండగా నిలుస్తుంది. నేను రైతు బిడ్డను అయినందునే వారి బాధలు తెలుసు.’ అని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news