ఇటీవల ఏపీలో కాపు వర్గం టార్గెట్ గా రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. కాపు వర్గం ప్రజలు దాదాపు పవన్ వైపుకు వస్తున్నారు. అలా వస్తే..మళ్ళీ టిడిపితో పొత్తు ఉంటే కాపుల ఓట్లు వన్ సైడ్ గా పడతాయి. దీంతో వైసీపీకి నష్టం. అందుకే కాపుల ఓట్లలో చీలిక తెచ్చేలా వైసీపీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం లాంటి వారిని తెరపైకి తీసుకొచ్చి పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దాని ద్వారా కాపుల ఓట్లని చీల్చడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఎన్ని చేసిన కాపుల ఓట్లు చీలే అవకాశాలు పెద్దగా లేవు. ఓ వైపు పవన్..మరో వైపు వంగవీటి రాధా..వీరి కాంబినేషన్ తో టిడిపి-జనసేన పొత్తుకే కాపుల ఓట్లు భారీగా పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో పవన్ దాదాపు భీమవరంలో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన్ని పిఠాపురం, కాకినాడ లో పోటీ చేయాలని వైసీపీ నేతలు సవాళ్ళు విసురుతున్నారు..కానీ ఆయన భీమవరంలోనే పోటీచేసే ఛాన్స్ ఉంది. దీని వల్ల పశ్చిమ గోదావరిలో పవన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది.
ఇక ఎప్పటినుంచో రాధా భవిష్యత్ పై చర్చ జరుగుతుంది. ఆయన అధికారికంగాతో టిడిపిలోనే ఉన్నారు..కానీ పార్టీలో పూర్తిగా యాక్టివ్ లేరు. సొంతంగా పనులు చేసుకుంటున్నారు. అలా అని వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు లేవు. అయితే ఈయన నెక్స్ట్ పోటీ చేస్తారా? లేదా? అనే ప్రశ్నలు కాపు వర్గంలో వస్తుంది. పోటీ చేయకుండా టిడిపి, జనసేన గెలుపు కోసం పనిచేసి ఎమ్మెల్సీ గాని రాజ్యసభ తీసుకుంటారా? అనేది క్లారిటీ లేదు.
ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడ పోటీ చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఆయన సొంత సీటు విజయవాడ సెంట్రల్ లో టిడిపి నేత బోండా ఉమా ఉన్నారు. విజయవాడ ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ ఉన్నారు. విజయవాడ వెస్ట్ లో పోటీ చేయరు. పోనీ బందరు ఎంపీగా పోటీ చేస్తారా? లేదా ఏలూరు ఎంపీ..కాకినాడ ఎంపీ..వీటిల్లో ఎక్కడ పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. చూడాలి మరి రాధాతో బాబు ఎలాంటి స్కెచ్ వేస్తారో.