ఈడీ కస్టడీ చట్టవిరుద్ధం.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

-

దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తనను ఈడీ కస్టడీకి అప్పగించడం చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అత్యవసర పిటిషన్‌ కింద విచారణ చేపట్టి.. వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.

దిల్లీలోని కేజ్రీవాల్‌ నివాసంలో ఈనెల 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రౌస్‌ అవెన్యూ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా 7 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈ విచారణ సందర్భంగా మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి కేజ్రీవాలేనని ఈడీ ఆరోపిస్తూ.. ఆయన కేబినెట్‌లోని మంత్రులు, ఆప్‌ నేతలు ఈ కుట్రలో భాగస్వాములని తెలిపింది. 10 రోజుల కస్టడీకి అనుమతివ్వాలని కోరగా న్యాయస్థానం 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version