Breaking News : ఢిల్లీ సీఎం పదవీకి కేజ్రీవాల్ రాజీనామా

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై బయటికి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజు రోజుల కిందట సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన రెండు రోజుల్లో  రాజీనామా చేస్తానని చెప్పినట్టుగానే తాజాగా రాజీనామా చేశారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా నివాసం వద్దకు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

ఇవాళ సాయంత్రం గవర్నర్ అపాయింట్ కోరారు. అనుకున్నట్టుగా సాయంత్రం గవర్నర్ నివాసానికి వెళ్లారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ని కలిసి రాజీనామా లేఖ అందించారు. ఇదిలా ఉంటే ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి బాధ్యతలు అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. కేజ్రీవాల్ రాజీనామా లేఖను అందించిన సమయంలో ఆయన వెంట పలువురు మంత్రులు, కీలక నేతలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version