మూడు కమిషనరేట్ ల పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం : డీజీపీ

-

ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. వివిధ మత పెద్దలతో రెండు సార్లు కో ఆర్డినేషన్ మీటింగ్ లెవల్ జరిగింది అని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. సీపీ మరియు డీసీపీ లెవల్ లో కూడా మీటింగ్స్ పెట్టాము. గణేష్ నిమజ్జనం మరియు ప్రశాంత వాతావరణం లో కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారు. బాలాపూర్ గణేశుడు ఇప్పటికే NTR మార్గ్ కు చేరుకున్నాడు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు, ఏర్పాట్లు చేశాము. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం సజావుగా సాగింది. ఈరోజు రాత్రి లోగా నిమజ్జనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా టైం టు టైం మేము అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెల్లుతాం. డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం. హైదరాబాద్ లో సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి టీవీ లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. మూడు కమిషనరేట్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయి. రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రి లోపే నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటాం అని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version