ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడ వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఓమైక్రాన్. ఓమైక్రాన్ వేరియంట్ ను ఎలా అదుపు చేయాలని ప్రపంచ వ్యాప్తం గా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఓమైక్రాన్ వేరియంట్ కట్టడి కి భారత్ బయోటెక్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఓమైక్రాన్ పై కోవాగ్జిన్ టీకా ఎలా పని చేస్తుందో పరిశోధనలు ప్రారంభించామని భారత్ బయోటక్ ప్రకటించింది. అయితే కోవాగ్జిన్ టీకాను కరోనా వైరస్ ను ఎదుర్కొనే విధంగా అభివృద్ధి చేశామని తెలిపారు.
అయితే ఈ టీకా కరోనా వేరియంట్ అయిన ఓమైక్రాన్ పై ఎంత వరకు పని చేస్తుందా అని పరిశోధనలు చేస్తున్నామని తెలిపింది. అయితే కోవాగ్జిన్ టీకా ఓమైక్రాన్ వేరియంట్ పై సమర్థ వంతం గా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మన దేశంలో కోవాగ్జిన్ టీకా ల నిల్వ లు చాలా ఉన్నాయని తెలిపింది. ఇటీవలే కోవాగ్జిన్ టీకాల ను విదేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. ఇక కోవాగ్జిన్ టీకాలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ప్రకటించారు.