కేంద్రం యాసంగి వడ్లు కొనమని తెగేసి చెప్పడం.. రాష్ట్ర ప్రభుత్వం కూడా యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్ఫష్టం చేయడంతో ఈసారి తెలంగాణ లో గణనీయంగా తెలంగాణలో వరిసాగు తగ్గనుంది. ఇటీవల సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా వరి వేయవద్దని తెలంగాణ రైతాంగానికి సూచించారు. మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై కూడా ఇప్పటి వరకు ఎటువంటి క్లారీటీ ఇవ్వలేదు.
ఈ యాసంగిలో తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లోనే వరి సాగు అవుతుందని అంచానా వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. రైతులు తమ అవసరాల నిమిత్తం, మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్నవాళ్లు, విత్తనాల అభివ్రద్ది కోసం పంటలను వేసేవారు మాత్రమే ప్రస్తుతం యాసంగిలో వరిని సాగు చేసే అవకాశం ఉంది. కేంద్రం బాయిల్డ్ రైస్ వద్దనటంతో ఈ యాసంగిలో తెలంగాణ వ్యాప్తంగా వరి పంట విస్తీర్ణం తగ్గనుంది. గతేడాది తెలంగాణ వ్యాప్తంగా యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు.