హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో కోల్కతా మరియు హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్కతా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు గెలుపు ఓటముల మధ్య దోబూచులాట జరిగింది. చివరికి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కోల్కతా గెలిచి ఊపిరి పీల్చుకుంది.
మొదటి 10 ఓవర్లు మాత్రమే కోల్కతా వైపు మ్యాచ్ ఉంది, ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ను మార్ క్రామ్ మరియు క్లాజెన్ లు దాదాపు జట్టును గెలిపించినంత పని చేశారు… కానీ వరుసగా క్లజెన్ మరియు మార్ క్రామ్ వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను టైట్ చేసింది. దీంతో హైదరాబాద్ ఓడిపోయింది. అయితే, SRH తో మ్యాచ్ లో చివరి ఓవర్ వేసే సమయంలో తన హార్ట్ బీట్ 200కు చేరిందని KKR బౌలర్ వరుణ్ చక్రవర్తి తెలిపారు. నిన్నటి మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో అద్భుత స్పెల్ తో ఈ స్పిన్నర్ మ్యాచ్ KKR వైపు తిప్పేసారు. తన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సైతం సొంతం చేసుకున్నారు. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సి ఉండగా, వరుణ్ కేవలం 3 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు. మొత్తంగా 4 ఓవర్లకు 20 పరుగులిచ్చి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.