ఇంజనీర్స్ డే… ఆ మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకోండి..

-

సెఫ్టెంబర్ 15.. ఇండియాలోనే కాదు శ్రీలంక, టాంజానియా దేశాల్లోనూ ఇదే రోజున ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. భారతదేశం గర్వించదగ్గ ఇంజనీరు, భారత రత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 15వ తేదీన ఇంజనీర్స్ డే గా జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. ఎమ్ వీ విశ్వేశ్వరయ్యగా అందరికీ పరిచయం. కర్ణాటకలోని ముద్దనహల్లి గ్రామలో 1861వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన జన్మించాడు.

చిన్నప్పటి నుండి చదువు మీదున్న ఆసక్తితో చాలా పట్టుదలగా చదివాడు. పాఠశాలకి వెళ్ళడానికి మైళ్ళ దూరం నడిచి మరీ వెళ్లారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బీఏలో పట్టా అందుకుని, ఇంజనీరింగ్ విద్యకోసం పూనే చేరుకున్నాడు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక బొంబాయి ప్రభుత్వ ప్రజా పనుల విభాగంలో అసిస్టెంట్ గా చేరాడు. అప్పటి నుండి ఆయన కెరీర్ 34ఏళ్ల పాటు సాగింది.

మైసూరు క్రిష్ణరాజు సాగర్ ఆనకట్టకి ఛీఫ్ ఇంజనీర్ గా పనిచేసారు. హైదరాబాద్ లోనూ ఆయన సేవలు అందించారు. మూసీ నది వరదలకి గురైనపుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలోనే విపత్తు నిర్వహణ పనులు జరిగాయి. 1912 నుండి 1919వరకి మైసూర్ దివాన్ గా ఉన్నారు. భారత బ్రిటీష్ సామ్రాజ్యం, ఆయన చేసిన సేవలకి గాను నైట్ బిరుదుతో సత్కరించింది. 1955లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారత రత్న అందుకున్నారు.

బ్లాక్ సిస్టమ్ అనే సరికొత్త ఇరిగేషన్ టెక్నాలజీ సృష్టించాడు. బెంగళూరులో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కోసం స్థాపించడంలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించాడు. 1917లో స్థాపింపబడ్డ ఈ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రస్తుతం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంగా పిలవబడుతుంది. సివిల్ ఇంజనీరుగా భారతదేశానికి ఎన్నో సేవలందించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1962లో తుది శ్వాస విడిచారు.

Read more RELATED
Recommended to you

Latest news