ఒకే ఆర్డర్‌లో 125 రుమాలీ రోటీలు.. జొమాటో సీఈవో షాక్

-

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్లో చుక్కా ముక్కా లేకపోతే అసలు మజాయే ఉండదు. ముఖ్యంగా యువకులు న్యూ ఇయర్ వేడుకల్లో చేసే సందడి అంతా ఇంతా కాదు. డిసెంబర్ 31 రోజున స్నేహితులంతా ఒక చోట చేరి అలా సిట్టింగ్ వేసి డ్యాన్సులు చేస్తూ గోలగోల చేస్తూ ఉంటారు. అదే సమయంలో నచ్చిన ఫుడ్ తింటూ ఆనందంగా గడుపుతారు. కొందరేమో ఇంట్లోనే అంతా కలిసి వంట చేసుకుంటే మరికొందరు మాత్రం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు.

అలా కోల్కతాలో ఓ వ్యక్తి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చేసిన ఓ ఆర్డర్ను చూసి ఏకంగా జొమాటో బాసే షాకయ్యాడు. సదరు వ్యక్తి ఏకంగా 125 రుమాలీ రోటీలు జొమాటో యాప్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఆ సంస్థ సీఈవో దీపిందర్‌ గోయల్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందించారు. ఆ పార్టీకి వెళ్లాలని ఉందంటూ ట్వీట్ చేశారు. ‘‘ ఒక్క ఆర్డర్‌లోనే 125 రుమాలీ రోటీలు ఆర్డర్‌ చేశారు. ఆ పార్టీకి నిజంగా వెళ్లాలనిపిస్తోంది’’ అని గోయల్‌ పోస్టు చేశారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version