ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లఖి0పూర్ ఖేరి అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కేంద్ర మంత్రి తనయుడు నిర్దాక్షిణ్యంగా రైతులను కారుతో గుడ్దించిన ఘటన. ఈ సంఘటన మీద దేశవ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి.
అలాంటి ఈ ప్రాంత నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల లెక్కింపు లో అధికార బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ శాసనసభ్యుడు యోగేష్ వర్మ ముందంజలో ఉన్నాడు. తన సమీప ప్రత్యర్థి ఎస్పీ నుండి బరిలోకి దిగిన ఉత్తరకేశ్ వర్మ మధుర్ మీద ఆధిక్యంలో కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
2017 లో ఇక్కడి నుంచే పోటీ చేసిన వర్మ తన ప్రస్తుత ప్రత్యర్థి మధుర్ మీద విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పోటీ వీరిద్దరి మధ్యే. యోగేష్ వర్మ ఇక్కడ గెలిస్తే బీజేపీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుంది అని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.