మరో ప్రేమ జంటపై అమానుషం.. నాగలికి ఎద్దుల్లాగా కట్టి

-

మరో ప్రేమ జంటపై అమానుషం చోటు చేసుకుంది. ఒడిశా-రాయగడ జిల్లాలో ప్రేమజంటను నాగలికి ఎద్దుల్లాగా కట్టి పొలం దున్నించిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన జరిగింది. నాగలికి ఎద్దుల్లాగా కట్టి, కర్రలతో కొడుతూ పొలం దున్నించారు గ్రామ పెద్దలు. కోరాపుట్ జిల్లా నారాయణ పట్టణం సమితి బైరాగి పంచాయతీ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.

lovers
lovers

పెద్దఇటికీ గ్రామానికి చెందిన అమ్మాయి, అబ్బాయి వరుసకు అన్నాచెల్లెలు అవుతారు. ప్రేమించుకుని ఐదేళ్ల క్రితం ఊరిని విడిచి వెళ్ళింది జంట. గ్రామస్థుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేస్తామని నమ్మించి తిరిగి రప్పించారు కుటుంబ సభ్యులు. పెళ్లికి గ్రామ పెద్దలు అంగీకరించకపోవడంతో నాగలికి ఎద్దుల్లాగా కట్టి పొలం దున్నించి, హింసించారు.

Read more RELATED
Recommended to you

Latest news