ఇటీవల భార్య, అత్తల వేధింపులతో బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసు తర్వాత ఇటీవల ఇలా భార్య, అత్తింటి వేధింపులతో సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల మరో టెకీ కూడా భార్య వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కంపెనీకి మెయిల్ చేసి మరీ చనిపోయాడు. ఈ ఘటనలు మరవకముందే మరో వ్యక్తి ఇలాంటి కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మధ్యప్రదేశ్ రేవాలోని సిర్మౌర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య, అత్త వేధింపులే కారణం అంటూ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో చెబుతూ సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇక్కడే ఓ షాకింగ్ ట్విస్టు ఉంది. తన భర్త లైవ్ లో ఆత్మహత్య చేసుకుంటుండటం అతడి భార్య చూసినట్లు సమాచారం. ఈ ఘటనపై మృతుడి కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. లైవ్ లో అతడు చెప్పినట్లుగా భార్య, మరో మహిళను అరెస్టు చేశారు.