కాలేజీ విద్యార్థికి రూ.46 కోట్ల టాక్స్ నోటీసులు

-

కాలేజీకెళ్లి చదువుకునే విద్యార్థికి ఆదాయపు పన్ను అధికారులు పన్ను నోటీసులు (టాక్స్ నోటీసులు) ఇచ్చారు. కంగుతిన్న విద్యార్థి పోలీసులను ఆశ్రయించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. అయితే ఆ విద్యార్థి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయని అందుకే నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే?

గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్‌ కుమార్‌ దండోటియాకు ఇటీవల అతడికి ఐటీ, జీఎస్‌టీ నుంచి పన్ను నోటీసులు అందాయి. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయని, అందుకు గానూ పన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. షాకైన ఆ విద్యార్థి సంబంధిత అధికారులను సంప్రదించగా తన పాన్‌ కార్డుపై ఓ కంపెనీ రిజిస్టర్‌ అయినట్లు తెలిసింది. ఆ కంపెనీ 2021 నుంచి ముంబయి, దిల్లీ వేదికగా కార్యకలాపాలు సాగించిందని తెలుసుకున్న అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఆ కంపెనీ గురించి తనకు తెలియదని పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ విద్యార్థి పాన్‌ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి కంపెనీని రిజిస్టర్‌ చేశారని దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news