‘నేను ఫ్లైట్ డోర్‌ పక్కన కూర్చోనుగా’.. బోయింగ్‌పై బైడెన్‌ చమత్కారం

-

ఇటీవల బోయింగ్ విమానాలు ఇంజినీరింగ్, క్వాలిటీ సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అందువల్ల ఈ కంపెనీ నియంత్రణ సంస్థల నిఘా మరింత ఎక్కువైంది. నాణ్యత, భద్రత విషయంలో తనిఖీలు తీవ్రతరం కావడంతో ఉత్పత్తి సైతం నిలిచిపోయింది. దీంతో డెలివరీలు ఆగిపోయాయి. తాజాగా బోయింగ్ ఘటనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఓ టాక్షోలో పాల్గొన్న బైడెన్ను ఆ షో వ్యాఖ్యాత బైడెన్‌ .. ‘‘మీరు న్యూయార్క్‌ సిటీకి బయల్దేరేముందు మీ రవాణాశాఖ మంత్రి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ బోల్టులు బిగించారా..?’’ అంటూ ప్రశ్నించారు. దానికి బైడెన్ బదులిస్తూ.. ‘‘నేను తలుపు పక్కన కూర్చోను. జస్ట్‌ జోక్‌ చేస్తున్నాను. అయితే ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదు’’ అంటూ వ్యాఖ్యానించారు.

కొద్దినెలల క్రితం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరింది. విమానం 16,000 అడుగుల ఎత్తుకు చేరగానే.. ఎడమవైపున్న తలుపు ఊడిపోయింది. విమానాన్ని వెంటనే వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్‌ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఇలాంటి ఇంజినీరింగ్, క్వాలిటీ సమస్యలు కోకొల్లలుగా ఈ విమానాల్లో ఉత్పన్నమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news