మణిపూర్ ముఖ్యమంత్రిని తొలగించాల్సిందేనని ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే… ప్రధాని నరేంద్ర మోడినుద్దేశించి ట్వీట్ చేశారు. నిన్న పార్లమెంట్ లో కేంద్ర సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదని…మీకు ఆగ్రహం ఉంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో బూటకపు పోలికలు చేయకుండా, ముందుగా మీ మణిపూర్ ముఖ్యమంత్రిని తొలగించాల్సిందని ఆగ్రహించారు.
ఈ రోజైనా పార్లమెంట్ లో సవివరంగా ప్రకటన చేస్తారని భారత ప్రజలు ( ఇండియా) భావిస్తున్నారని తెలిపారు. ఒక ఘటన గురించి కాదు, మీరు అధికారంలో ఉన్న మణిపూర్ లో 80 రోజులుగా సాగుతున్న హింస గురించి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఖర్గే. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమీ పట్టనట్లు చూస్తూ ఉన్నారని ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే.
.@narendramodi ji,
You did not make a statement inside the Parliament, yesterday.
If you were angry then instead of making false equivalence with Congress governed states, you could have first dismissed your Chief Minster of Manipur.
INDIA expects you to make an elaborate…
— Mallikarjun Kharge (@kharge) July 21, 2023