తెలంగాణ ఎవరు ఇచ్చారు..? ఎవరి కోసం ఇచ్చారు : మల్లికార్జున ఖర్గే

-

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్ సోనియా ఇంటికి వెళ్లాడు. ఆ తరువాత ఆమె కాళ్లు మొక్కాడు. ఆ తరువాత రోజూ మాట మార్చాడు.

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరాగాంధీ హయాంలో బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఆర్డినెన్స్ వంటి ఫ్యాక్టరీలు వచ్చాయి. బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
కాంగ్రెస్ పేదల కోసం పని చేస్తుందన్నారు. ఇందిరాగాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలను తీసుకొచ్చేదే కాదు. ఇందిరాగాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టి దేశమంతా కాంగ్రెస్ ను గెలిపించింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ స్కీమ్ లను అమలు చేస్తుందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ రూ.5లక్షల అప్పు ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news