గత పార్టీలు గతంలో ఏం చేశారు.. భవిష్యత్ లో ఏం చేశారని ఒక్కసారి ఆలోచించాలని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. నాగార్జున సాగర్ పేరు నందికొండ ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఉన్న దగ్గర కాదు.. ఏలేశ్వరం అనే గ్రామం వద్ద నిర్మించాలి. గోల్ మాల్ చేసి కిందికి తీసుకొచ్చారు. అలా నిర్మించినట్టయితే తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉండేది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నేతలు ఎవ్వరూ కొట్లాడలేదు. కాళేశ్వరం నీళ్లు వస్తే రెండు పంటలు పండుతాయి.
తెలంగాణ రాకముందు సాగర్ నీళ్ల కోసం రైతులు నా దగ్గరికీ వచ్చారు. 24 గంటలు రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చామని గుర్తు చేశారు కేసీఆర్. రైతులు కోరితే మొన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేశాం. ఓట చేతిలో బ్రహ్మాస్త్రం. పంటపొలాలు, ఎండాలా..? పండాలా అనేది మీ ఓటు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కోదాడలో మల్లయ్య యాదవ్ గెలవడు అని చాలా మంది నాతో చెప్పారు. ఆయనకు టికెట్ ఇవ్వకూడదన్నారు. కానీ ఏది అయితే అది అయింది ఈసారి ఇచ్చి చూద్దామని.. కోదాడ నుంచి మల్లయ్య యాదవ్ కి టికెట్ ఇచ్చాను. మల్లయ్య యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. కోదాడలో బీసీ భవన్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.