వచ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి ప‌రాజయం త‌ప్ప‌దు : మ‌మ‌తా బెన‌ర్జీ

-

ప‌శ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ బీజేపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి 200 సీట్లు వెల్లడించారు. తాను టీఎంసీకి జాతీయ పార్టీ హోదా కోసం తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను క‌లిసిన‌ట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని తెలిపారు. ఈసీ బీజేపీ గుప్పిట్లో ఉంద‌ని, వారు త‌మ పార్టీకి జాతీయ హోదాను తీసేశార‌ని ఆమె అన్నారు. కొద్దిపాటి సామ‌ర్ధ్యం ఉన్న పార్టీల‌కూ జాతీయ పార్టీ హోదా ఇవ్వాల‌ని, త‌మ పార్ట పేరు ఆల్ ఇండియా తృణ‌మూల్ కాంగ్రెస్‌గా ఉంటుంద‌ని మమతా వ్యక్తపరిచారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ పార్టీ నేత‌లు తాము కోరుకున్న‌వ‌న్నీ చేస్తున్నార‌ని, అయితే అధికారం తాత్కాలిక‌మేననే విష‌యం వారు గుర్తుపెట్టుకోవాల‌ని పేర్కొన్నారు. అధికారం వ‌స్తుంటుంది…పోతుంటుంది కానీ ప్ర‌జాస్వామ్యం ఎన్న‌టికీ కొన‌సాగుతుంద‌ని దీదీ తేల్చి చెప్పారు. రాజ్యాంగం కూడా ఎప్ప‌టికీ నిలిచిఉంటుంద‌ని, రాజ్యాంగాన్ని ఎవ‌రూ బుల్డోజ్ చేయ‌లేర‌ని, అందుకే 2024 ఎన్నిక‌ల్లో బీజేపీకి పరాజయం త‌ప్ప‌ద‌ని అన్నారు మమతా బెనర్జీ.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version