కరోనా మాస్క్‌లో ఫోన్‌.. ఎగ్జామ్‌లో కాపీ కొట్టేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయాడు..!

-

పరీక్షల్లో సహజంగానే కొందరు కాపీలు కొడుతుంటారు. చిట్టీలు పెట్టుకుని వచ్చి లేదా బ్లూటూత్‌లు, ఇతర పరికరాల సహాయంతో పరీక్షల్లో కాపీలు కొడుతారు. కానీ అక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా మోడ్రన్‌ పద్ధతిలో చీటింగ్‌కు పాల్పడ్డాడు. కరోనా నుంచి సేఫ్టీ కోసం మాస్కులను ధరిస్తున్నామనే ముసుగులో ఆ మాస్క్‌ ద్వారానే ఓ వినూత్నమైన డివైస్‌తో ఎగ్జామ్‌లో కాపీ కొట్టబోయాడు. అధికారులకు అడ్డంగా దొరికాడు. వివరాల్లోకి వెళితే…

బీహార్‌లోని వైశాలి జిల్లా పానాపూర్‌ ధర్మపూర్‌ ప్రాంతంలోని హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ఇటీవల కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్‌ నిర్వహించారు. అయితే అక్కడి పరీక్ష కేంద్రంలో రూమ్‌ నంబర్‌ 16లో విశాల్‌ కుమార్‌ అనే అభ్యర్థి మొబైల్‌ ఫోన్‌ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు రాస్తుండడాన్ని అక్కడే ఉన్న అశుతోష్‌ కుమార్‌, ముంతాజ్‌ అనే కానిస్టేబుల్స్‌ పసిగట్టి అతన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అయితే మొబైల్‌ ఫోన్‌ ను సాధారణంగా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు కదా. కానీ విశాల్‌ మొబైల్‌ను ఎలా వాడాడు ? అనేదే కదా మీ సందేహం. అయితే అక్కడే ఉంది అసలు కిటుకు. అతను తెలిసిన వ్యక్తుల సహాయంతో తాను ధరించిన మాస్క్‌లోనే మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన పార్ట్‌లను ఉంచాడు. మదర్‌బోర్డు, బ్యాటరీ, సిమ్‌ స్లాట్‌, బ్లూటూత్‌ ధరించేందుకు కాపర్‌ వైర్‌ వంటి వాటిని మాస్క్‌లో ఏర్పాటు చేశాడు. దీంతో ఆ డివైస్‌ మొబైల్‌లా పనిచేయసాగింది. బయటకు చూసేవారికి మాత్రమే అది మాస్క్‌లా కనిపిస్తుంది. కానీ దాని లోపల ఫోన్‌ పార్టులు ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇలా అతను ఎగ్జామ్‌లో కాపీ కొట్టేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ క్రమంలో అధికారులు అతన్ని పోలీసులకు అప్పగించగా వారు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version