నేడు త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా ప్రమాణ స్వీకారం

-

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.

‘మిస్టర్ క్లీన్’​గా పేరున్న మాణిక్ సాహా టౌన్ బర్దోవాలి నుంచి 1,257 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అశిశ్ కుమార్ సాహాపై విజయం సాధించారు. ఈ క్రమంలో రెండో సారి కూడా త్రిపుర ముఖ్యమంత్రి పీఠం మాణిక్ సాహానే వరిస్తోంది. మాణిక్ సాహా 2022లోనే త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అప్పటి నుంచి పార్టీ అసమ్మతి నేతలను కలుపుకుంటూ ముందుకు సాగారు. అలాగే క్లీన్ ఇమేజ్​ను సంపాదించుకున్నారు. సాహా.. స్వతహాగా వైద్యుడు. స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉండడం పార్టీ విజయంలో సహాయపడిందని విశ్లేషకులు అంటున్నారు.

2018లో మూడు దశాబ్దాల వామపక్షాల పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. సీఎం పీఠాన్ని బిప్లవ్ కుమార్​ దేవ్​కు అప్పగించింది. ఆయన వివాదస్పద వ్యాఖ్యలు, శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. దీంతో ఆయనను తప్పించి బీజేపీ అధిష్ఠానం మాణిక్ సాహాను 2022లో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version