ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే మళ్ళీ అధికారం వైసీపీదేనని చెప్తున్నాయి కొన్ని సర్వేలు. ఈసారి వచ్చేది అలాంటి ఇలాంటి గెలుపు కాదని గతంలో కంటే అధికంగా వైసీపీ సీట్లు గెలుచుకుటుందని చెప్తున్నాయి.సీఎం చెబుతున్నట్లు వై నాట్ 175 అనేది నిజం అవుతుందని సర్వే సంస్థలు కుండబద్దలు కొడుతున్నాయి. 99 శాతం హామీలను అమలు చేయడమే వైసీపీకి ప్రధానంగా కలిసొచ్చే అంశంగా సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. సీఎం జగన్ పాలనపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో మునుపటి కంటే వైసీపీని మరింతగా ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పాయి. సీఎం తలచుకుంటే 175 సీట్లను సాధించడం పెద్ద విషయం కాదని చెప్తూ వైసీసీ శ్రేణులకు మంచి బూస్టప్ ఇచ్చే విధంగా సర్వే సంస్థలు లెక్కలు కడుతున్నాయి.
ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచే వైసీపీ శ్రేణుల్లో ఉరిమే ఉత్సాహాన్ని ఇచ్చిన మాట వైనాట్ 175. అధి కూడా చెప్పింది ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇచ్చిన హామీలన్నింటినీ గడిచిన నాలుగేళ్ళలో అమలు చేసినందున ధీమాతో సీఎం ఈ మాట అన్నారు. కుప్పం వేదికగా పలువురు నేతలతో వైనాట్ 175 అనే మాటను నినాదంగా మార్చి ఏపీ అంతటా ప్రతిధ్వనించేలా గట్టిగా వినిపించారు. అర్హతే ప్రామాణికంగా గడిచిన నాలుగేళ్ళలో సంక్షేమ పథకాలను అమలు చేశారు సీఎం జగన్. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో గెలిచి వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ ప్రవేశపెట్టనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అందుకే వై నాట్ 175 అంటూ పార్టీ శ్రేణులకి దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే దీనిని ఇన్నాళ్ళు ప్రతిపక్ష పార్టీలు తేలిగ్గా తీసుకున్నాయి. కానీ సీఎం వైయస్ జగన్ ఈ మాటను ఊరికే అనలేదని, తలుచుకుంటే అది పెద్ద విషయం కాదని సర్వేలు నిరూపిస్తున్నాయి.
అందుకే వై నాట్ 175 అంటూ పార్టీ శ్రేణులకి దిశా నిర్దేశం చేస్తున్నారు సీఎం జగన్.ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం టైమ్స్ నౌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏపీలో వైయస్సార్సీపీకి 22-23 ఎంపీ స్థానాలు వస్తాయని తేలింది.ఇక ప్రస్తుతం అదే టైమ్స్ గ్రూప్ కి చెందిన టైమ్స్ నౌ నవభారత్ నిర్వహించిన జన్ గన్ కా మన్ సర్వేలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏపీలో వైయస్సార్సీపీ 24-25 ఎంపీ సీట్లు గెలుస్తుందని స్పష్టమైంది. ప్రతిపక్ష టీడీపీ కేవలం 0-1 స్థానాలకే పరిమితం అవుతుందని ఈ సర్వే తేల్చింది.వీటిని బట్టి చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్సీపీ 175 కి 175 స్థానాల్లో గెలుపొందడం పెద్ద కష్టం కాదని, వై నాట్ 175 అనే లక్ష్యాన్నిసునాయాసంగా వైయస్ జగన్ చేరుకుంటారని స్పష్టమవుతోంది.
If the LS Polls were to be held now, who would get how many seats, in terms of vote share?
BJP – 38.08%
INC – 28.82%
Others – 33.10%@PadmaJaJoshi sheds more light on Times Now – @ETG_Research survey results.@Kamru_Choudhury, @alok_ajay & @ashutosh83B further debate this. pic.twitter.com/MwnOqoXx0v
— TIMES NOW (@TimesNow) July 1, 2023