17 నెలల తర్వాత ఇంట్లో టీ తాగుతున్నా: మనీశ్‌ సిసోదియా

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఆప్‌ నేత మనీశ్ సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన శుక్రవారం నుంచి తీహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. సిసోదియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని ఆదేశిస్తూ రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో విడుదల చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన ఆయన తాజాగా ఓ పోస్టు చేశారు.

ఇవాళ ఉదయం సోషల్ మీడియాలో ఓ పోస్టు చేస్తూ.. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది. అందరితోపాటు కలిసి ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ భగవంతుడు మనకు ప్రసాదించాడు అని పోస్టులో పేర్కొన్నారు. మనీలాండరింగ్‌తో ముడిపడిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిసోదియా 17 నెలలు తిహాడ్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. మనీశ్ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్‌ బీఆర్ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం ‘బెయిల్‌ అనేది నియమం- జైలు మినహాయింపు’ అనే విషయాన్ని ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Latest news