గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బనస్కంతా జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 13 మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. దీసా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కర్మాగారంలో ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది చోటుచేసుకుంది.
పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోవడంతో పలువురు కార్మికులు, వారి కుటుంబసభ్యులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే కొందరిని కాపాడి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఫ్యాక్టరీ యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.