మెగాస్టార్ చిరంజీవికి బంపర్ ఆఫర్ తగిలినట్లు సమాచారం అందుతోంది. మోడీ కేబినెట్‌లోకి మెగాస్టార్ చిరంజీవి రానున్నారని అంటున్నారు. త్వరలోనే మోదీ కేబినెట్ లో చిరంజీవి మంత్రి కాబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. చిరుని పార్టీలోని చేర్చుకుని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో కాపుల ఓట్లు చిరు, పవన్ ద్వారా వస్తాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు.
2025 జూన్ లో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒకటి చిరంజీవికి కేటాయించే అవకాశం ఉందని కాషాయ పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నారు. అయితే… మోడీ అశీస్సులు ఉంటే.. నిజం గానే… మెగాస్టార్ చిరంజీవికి బంపర్ ఆఫర్ తగిలినట్లు అవుతుంది. కాగా నిన్న ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో మెగాస్టార్ చిరంజీవి పొంగల్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పాల్గొన్నారు. ఘనంగా జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ ఉత్సవాలు జరిగాయి. బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు కూడా హాజరయ్యారు.