కోడి పందెం శిబిరం వద్ద యువకుల ఘర్షణ.. బీరు సీసాతో తలపై దాడి

-

ఆంధ్రాలో జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన వారంతా పల్లెలకు తిరిగొచ్చారు. దీంతో పల్లెలన్నీ కలకలలాడుతున్నాయి. ప్రతి ఇంట్లోని వారంతా తమ కుటుంబాలతో సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. యువత, పిల్లలంతా గాలిపటాలు ఎగరేస్తుంటే.. పురుషులు మాత్రం జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు.

ఇదిలాఉండగా కోడి పందాల సెంటర్ల వద్ద పలు చోట్ల చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన కోడి పందెం బరి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీరు బాటిళ్లతో వణుకూరు-పునాదిపాడు యువకులు కొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కంకిపాడు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version