తమిళనాడు, కేరళలకు బిగ్ అలర్ట్.. తమిళనాడు, కేరళలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. తమిళనాడు, కేరళ రెండు రాష్ట్రాల తీర ప్రాంతాలకు నేటి రాత్రి ఉప్పెన ముప్పు ఉండనుందని వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. తమిళనాడు, కేరళలకు ‘కల్లక్కడల్’ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది ఐఎన్‌సీవోఐఎస్.
రాత్రి 11.30 గంటలకు తీరంలో అలల తాకిడి భారీగా ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ. బీచ్‌ల వద్దకు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. దీంతో తమిళనాడు, కేరళల ప్రజలు…ఆందోళన చెందుతున్నారు.