భారత్ నేవీ అమ్ములపొదిలోకి ‘MH 60R సీహాక్’

-

ఇండియన్ నేవీ అమ్ముల పొదలోకి MH 60R సీహాక్ మోడల్ హెలికాప్టర్లు చేరాయి. సముద్రంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, క్షిపణులను నాశనం చేసేందుకు నేవీ వీటిని రంగంలోకి దించింది. కేరళ కొచ్చిలోని దక్షిణ నావల్ కమాండ్లో జరిగిన కార్యక్రమంలో నేవీ అధికారులు వీటిని కమిషన్ చేశారు. చీఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సమక్షంలో వీటిని నేవీలో భాగం చేశారు. MH 60R సీహాక్ మోడల్ తొలి హెలికాప్టర్ను కెప్టెన్ ఎమ్ అభిషేక్ రామ్ నడిపారు.

ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేవీల్లో ఒకటిగా పేరొందిన భారత నౌకాదళం MH 60R సీహాక్ రాకతో మరింత పటిష్ఠంగా మారింది. ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికా నుంచి 24 MH 60R సీహాక్ మోడల్ హెలికాప్టర్లను భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. దేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించే శత్రు జలాంతర్గాములను నిమిషాల వ్యవధిలో ఈ హెలికాప్టర్లు ధ్వంసం చేయగలవు. శత్రు స్థావరంపై దాడి చేసి సురక్షితంగా బయటకు రాగలవు.

Read more RELATED
Recommended to you

Latest news