భారత ఎన్నికల్లో జోక్యానికి చైనా యత్నాలు : మైక్రోసాఫ్ట్

-

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఓవైపు ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరులో మునిగిపోయాయి. విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయం హీటెక్కుతోంది. మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో బిజీ అయ్యారు. ఓవైపు దేశ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతుంటే.. భారత్ లో ఎన్నికలపై ప్రపంచ దేశాల కామెంట్స్ మరింత రసవత్తరంగా మారాయి. ఏకంగా ఐక్యరాజ్య సమితి కూడా భారతదేశ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా.. సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో చైనా అవాంతరాలు సృష్టించే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే తరహాలో అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోందని తెలిపింది. అందుకు కృత్రిమ మేధ(AI)ను అస్త్రంగా చేసుకోనుందంటూ హెచ్చరించింది. ఈ ఎన్నికల సంవత్సరంలో భారత్‌, అమెరికా, దక్షిణ కొరియాలో ఓటింగ్‌ జరగనున్న తరుణంలో చైనా తన ప్రయోజనాల నిమిత్తం ఏఐ కంటెంట్‌ను ఉపయోగించొచ్చని అంచనా వేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news