కారు నడిపి రెండు ప్రాణాలు బలిగొన్న మైనర్.. బాలుడికి వాహనమిచ్చిన తండ్రి అరెస్టు

-

మహారాష్ట్రలోని పుణె రోడ్డు ప్రమాదం కేసులో మైనరైన తన కుమారుడికి కారు ఇచ్చిన తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుణెలో ఆదివారం ఓ లగ్జరీ కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవ్‌ చేసిన మైనర్‌ను అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో బాలుడు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపినట్లు గుర్తించారు. అతివేగంతో బైక్‌ను ఢీ కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసు వ్యవహారంలోనే జువైనల్‌ జస్టిస్‌ యాక్టు కింద పోర్షే కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరోవైపు విశాల్‌ అగర్వాల్‌పై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బాలుడికి బెయిల్‌ మంజూరు చేసిన జువైనల్‌ కోర్టు.. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version