మణిపుర్ కల్లోలం.. 30 మంది ఆచూకీ గల్లంతు

-

జాతుల మధ్య వైరంతో మణిపుర్ రాష్ట్రం అట్టుడికిపోతోంది. దాదాపుగా మూణ్నెళ్ల నుంచి ఆ రాష్ట్రం రావణకాష్టంలా మారింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి దాదాపు 30 మంది అదృశ్యమైనట్లు సమాచారం. అయితే మూణ్నెళ్లవుతున్నా వీరి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. అదృశ్యమైన వారిలో టీనేజర్ల నుంచి నడివయస్సు వరకు ఉన్నారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నారు.

47 ఏళ్ల సమరేంద్ర సింగ్‌ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త. ఉద్రిక్తతలు మొదలైన కొద్దిరోజులకే అదృశ్యమయ్యాడు. ఇంతవరకూ అతడి జాడలేదని సింగ్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగ్ స్నేహితుడి జాడ కూడా లేదని తెలుస్తోంది. జులై ఆరున ఆంక్షలు సడలించడంతో 17 ఏళ్ల హిజామ్ లువాంగ్బీ నీట్ కోచింగ్‌ నిమిత్తం ఇంటి నుంచి వెళ్లింది. పరిస్థితులు సద్దుమణిగాయని భావించిన ఆమె.. తర్వాత తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి వారి జాడలేకుండా పోయింది. ఇలా మూడు నెలల వ్యవధిలో అదృశ్యమైన వారి వెనక ఒక్కో కారణం ఉంది. ఫిర్యాదులు అందిన వెంటనే తాము చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. కానీ కనిపించకుండా పోయిన వారి జాడ మాత్రం దొరకడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news