మ‌హిళ‌ల‌పై వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేసిన ఎమ్మెల్యే

క‌ర్ణాట‌క రాష్ట్ర అసెంబ్లి స‌మావేశాల సాక్షి గా ఒక‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌హిళల ప‌ట్ల చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అవుతున్నాయి. ఈ వ్యాఖ్య‌ల పై కాంగ్రెస్ పార్టీ మ‌హిళా స‌భ్యులతో పాటు ఇత‌ర పార్టీల స‌భ్యులు అసెంబ్లీ లో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కాగ గురువారం క‌ర్ణాట‌క అసెంబ్లీ లో అత్యాచార ఘ‌ట‌నల పై చర్చ జ‌రుగుతున్న సంద‌ర్భంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే ర‌మేష్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

”అత్యాచారం అనివార్యం అయిన స‌మ‌యాల్లో.. దానిని మ‌హిళ‌లు ఆనందించాల‌ని” ఎమ్మెల్యే ర‌మేష్ కుమార్ అన్నారు. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ గా మారింది. సొంత పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు, నేతులే రమేష్ కుమార్ వ్యాఖ్య‌ల‌పై తీవ్రం గా ఖండించారు. అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఎమెల్యే ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని సొంత పార్టీ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధులు కోరుతున్నారు. అలాగే అత‌నిపై కఠిన చర్య‌లు తీసుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ కర్ణాట‌క చీఫ్ ను కోరుతున్నారు.