రోజురోజుకి కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బెంగళూరు నగరంలో వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. ఇంత పకడ్బందీగా లాక్ డౌన్ పాటిస్తున్న కేసులు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో వారం రోజుల పాటు బెంగళూరు నగరంలో లాక్ డౌన్ పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా నియంత్రణకు గ్రేటర్ బెంగళూరు నగర పాలక మండలి అనేక కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుక వెలుతుంది.
ఈ నేపథ్యంలోనే బెంగళూరు నగరంలోని కంటైన్మెంట్ జోన్ లు, అలాగే హాట్ స్పాట్ ప్రాంతాలలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏకంగా 200 మొబైల్ ల్యాబ్ లను ఏర్పాటు చేసింది. దీనితో ప్రజలు ఉన్నచోటికే పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రంలో నమోదైన 51 వేల కేసులు, మరణాలలో సగం కేసులు కేవలం బెంగళూరు నగరంలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క బెంగళూరు నగరంలోని 25 వేలకు పైగా కేసులు నమోదవ్వగా, 500కు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. దీంతో బెంగళూరు నగరంలో ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు.