మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర పథకాలు, బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి అంశాలపై ఎంపీలకు ప్రధాని మోడి దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాలలో విపక్షాల ఆరోపణలను ఏ విధంగా ఎదుర్కొనే దానిపై చర్చించారు.
ఇక టర్కీ, సిరియాలలో సోమవారం సంభవించిన భూకంపాలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని మోదీ. తెలుగు విషయాన్ని బిజెపి ఎంపీ మనోజ్ తివారి వెల్లడించారు. 2001లో గుజరాతిలో సంభవించిన భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారని.. గుజరాత్ భూకంపం వల్ల దాదాపు 13 వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే కారణంతో టర్కీ ప్రజల కష్టాలను మోది అర్థం చేసుకోగలరని బిజెపి ఎంపీ మనోజ్ తివారి అన్నారు.