PM MODI : టీమిండియాకు ప్రధాని మోడీ అభినందనలు

-

Team India : వరల్డ్ కప్ ఫైనల్ చేరిన టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. విశేషమైన శైలిలో ఫైనల్స్ లోకి ప్రవేశించింది. అద్భుతమైన బ్యాటింగ్, మంచి బౌలింగ్ మన జట్టుకు మ్యాచ్ ని కట్టబెట్టింది’ అని ఆయన కొనియాడారు. ఫైనల్స్ కు చేరిన రోహిత్ సేనకు బెస్ట్ విషెస్ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Modi Congratulates Team India

ఇది ఇలా ఉండగా.. టీమిండియా ప్రభంజనం సృష్టించింది. న్యూజిలాండ్ పై సెమీస్ లో గెలిచిన భారత్….వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. ముంబైలోని వాంకడే స్టేడియంలో నవంబర్ 15న జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో భారత్ 70 పరుగులు తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టడంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు చేసింది.ఆ తర్వాత న్యూజిలాండ్ ను 48.5 ఓవర్లలో 327 పరుగులకే భారత బౌలర్లు ఆల్ అవుట్ చేశారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ పై 2019 పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version